Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Telugu IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Gujarati IRV (2019) Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 שִׁמְע֣וּ — בָ֭נִים — מ֣וּסַר — אָ֑ב — וְ֝הַקְשִׁ֗יבוּ — לָדַ֥עַת — בִּינָֽה׃ —
కుమారులారా, తండ్రి చెప్పే మంచి మాటలు విని వివేకం తెచ్చుకోండి.
2 כִּ֤י — לֶ֣קַח — ט֭וֹב — נָתַ֣תִּי — לָכֶ֑ם — תּֽ֝וֹרָתִ֗י — אַֽל־ — תַּעֲזֹֽבוּ׃ —
నేను మీకు మంచి మాటలు చెబుతాను. నా మాటలు పెడచెవిన పెట్టకండి.
3 כִּי־ — בֵ֭ן — הָיִ֣יתִי — לְאָבִ֑י — רַ֥ךְ — וְ֝יָחִ֗יד — לִפְנֵ֥י — אִמִּֽי׃ —
నేను నా తండ్రి కుమారుణ్ణి. నా తల్లికి నేను అందమైన ఏకైక కుమారుణ్ణి.
4 וַיֹּרֵ֗נִי — וַיֹּ֥אמֶר — לִ֗י — יִֽתְמָךְ־ — דְּבָרַ֥י — לִבֶּ֑ךָ — שְׁמֹ֖ר — מִצְוֺתַ֣י — וֶֽחְיֵֽה׃ —
ఆయన నాకు బోధ చేస్తూ ఇలా చెప్పాడు “నేను చెప్పే మాటలు శ్రద్ధగా విని వాటిని నీ హృదయంలో నిలిచిపోనివ్వు. వాటిని విని వాటి ప్రకారం నడుచుకుంటే నువ్వు జీవిస్తావు.
5 קְנֵ֣ה — חָ֭כְמָה — קְנֵ֣ה — בִינָ֑ה — אַל־ — תִּשְׁכַּ֥ח — וְאַל־ — תֵּ֝֗ט — מֵֽאִמְרֵי־ — פִֽי׃ —
జ్ఞానం, వివేకం సంపాదించుకో. నా మాటలను విస్మరించ వద్దు, వాటినుండి తొలగిపోవద్దు.
6 אַל־ — תַּעַזְבֶ֥הָ — וְתִשְׁמְרֶ֑ךָּ — אֱהָבֶ֥הָ — וְתִצְּרֶֽךָּ׃ —
జ్ఞానాన్ని విడిచిపెట్టకుండా ఉంటే అది నిన్ను కాపాడుతుంది. దాన్ని ప్రేమిస్తూ ఉంటే అది నిన్ను రక్షిస్తుంది.
7 רֵאשִׁ֣ית — חָ֭כְמָה — קְנֵ֣ה — חָכְמָ֑ה — וּבְכָל־ — קִ֝נְיָנְךָ֗ — קְנֵ֣ה — בִינָֽה׃ —
జ్ఞానం సంపాదించుకోవడమే బుద్ధి వివేకాలకు మూలం. జ్ఞానం కోసం నీకు ఉన్నదంతా ఖర్చు పెట్టు.
8 סַלְסְלֶ֥הָ — וּֽתְרוֹמְמֶ֑ךָּ — תְּ֝כַבֵּ֗דְךָ — כִּ֣י — תְחַבְּקֶֽנָּה׃ —
నువ్వు జ్ఞానాన్ని గౌరవిస్తే అది నిన్ను గొప్ప చేస్తుంది. దాన్ని హత్తుకుని ఉంటే అది నీకు పేరు ప్రతిష్టలు తెస్తుంది.
9 תִּתֵּ֣ן — לְ֭רֹאשְׁךָ — לִוְיַת־ — חֵ֑ן — עֲטֶ֖רֶת — תִּפְאֶ֣רֶת — תְּמַגְּנֶֽךָּ׃ —
అది నీ తలపై అందమైన పాగా ఉంచుతుంది. ప్రకాశవంతంగా వెలిగే అందమైన కిరీటం నీకు దయచేస్తుంది.
10 שְׁמַ֣ע — בְּ֭נִי — וְקַ֣ח — אֲמָרָ֑י — וְיִרְבּ֥וּ — לְ֝ךָ֗ — שְׁנ֣וֹת — חַיִּֽים׃ —
కుమారా, నీవు నా మాటలు విని, వాటి ప్రకారం నడుచుకుంటే నీకు అధిక ఆయుష్షు కలుగుతుంది.
11 בְּדֶ֣רֶךְ — חָ֭כְמָה — הֹרֵתִ֑יךָ — הִ֝דְרַכְתִּ֗יךָ — בְּמַעְגְּלֵי־ — יֹֽשֶׁר׃ —
జ్ఞానం కలిగి ఉండే మార్గం నీకు బోధించాను. యథార్థమైన బాటలో నిన్ను నడిపించాను.
12 בְּֽ֭לֶכְתְּךָ — לֹא־ — יֵצַ֣ר — צַעֲדֶ֑ךָ — וְאִם־ — תָּ֝ר֗וּץ — לֹ֣א — תִכָּשֵֽׁל׃ —
నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ అడుగులు చిక్కుపడవు. నీవు పరుగెత్తే సమయంలో నీ పాదాలు తొట్రుపడవు.
13 הַחֲזֵ֣ק — בַּמּוּסָ֣ר — אַל־ — תֶּ֑רֶף — נִ֝צְּרֶ֗הָ — כִּי־ — הִ֥יא — חַיֶּֽיךָ׃ —
అది నీ ఊపిరి కనుక దాన్ని సంపాదించుకో. దాన్ని విడిచిపెట్టకుండా భద్రంగా పదిలం చేసుకో.
14 בְּאֹ֣רַח — רְ֭שָׁעִים — אַל־ — תָּבֹ֑א — וְאַל־ — תְּ֝אַשֵּׁ֗ר — בְּדֶ֣רֶךְ — רָעִֽים׃ —
భక్తిహీనుల గుంపులో చేరవద్దు. దుర్మార్గుల ఆలోచనలతో ఏకీభవించవద్దు.
15 פְּרָעֵ֥הוּ — אַל־ — תַּעֲבָר־ — בּ֑וֹ — שְׂטֵ֖ה — מֵעָלָ֣יו — וַעֲבֽוֹר׃ —
అందులోకి వెళ్ళకుండా తప్పించుకు తిరుగు. దాని నుండి తొలగిపోయి ముందుకు సాగిపో.
16 כִּ֤י — לֹ֣א — יִֽ֭שְׁנוּ — אִם־ — לֹ֣א — יָרֵ֑עוּ — וְֽנִגְזְלָ֥ה — שְׁ֝נָתָ֗ם — אִם־ — לֹ֥א — [יכשולו] — (יַכְשִֽׁילוּ׃) —
ఇతరులకు కీడు చేస్తేనేగాని అలాంటి వాళ్లకి నిద్ర పట్టదు. ఎదుటి వారిని కించపరచకుండా వారు నిద్రపోరు.
17 כִּ֣י — לָ֭חֲמוּ — לֶ֣חֶם — רֶ֑שַׁע — וְיֵ֖ין — חֲמָסִ֣ים — יִשְׁתּֽוּ׃ —
వాళ్ళు దౌర్జన్యం చేసి తమ ఆహారం సంపాదించుకుంటారు. బలవంతంగా ద్రాక్షారసం లాక్కుని తాగుతారు.
18 וְאֹ֣רַח — צַ֭דִּיקִים — כְּא֣וֹר — נֹ֑גַהּ — הוֹלֵ֥ךְ — וָ֝א֗וֹר — עַד־ — נְכ֥וֹן — הַיּֽוֹם׃ —
ఉదయాన్నే మొదలైన సూర్యుని వెలుగు మరింతగా పెరుగుతున్నట్టు నీతిమంతుల మార్గం అంతకంతకూ ప్రకాశిస్తుంది.
19 דֶּ֣רֶךְ — רְ֭שָׁעִים — כָּֽאֲפֵלָ֑ה — לֹ֥א — יָ֝דְע֗וּ — בַּמֶּ֥ה — יִכָּשֵֽׁלוּ׃ — פ —
దుష్టుల మార్గం చీకటిమయం. వాళ్ళు ఎక్కడెక్కడ పడిపోతారో వాళ్ళకే తెలియదు.
20 בְּ֭נִי — לִדְבָרַ֣י — הַקְשִׁ֑יבָה — לַ֝אֲמָרַ֗י — הַט־ — אָזְנֶֽךָ׃ —
కుమారా, నేను చెప్పే మాటలు విను. నా నీతి బోధలు మనసులో ఉంచుకో.
21 אַל־ — יַלִּ֥יזוּ — מֵעֵינֶ֑יךָ — שָׁ֝מְרֵ֗ם — בְּת֣וֹךְ — לְבָבֶֽךָ׃ —
నీ మార్గం అంతటిలో నుండి వాటిని అనుసరించు. నీ హృదయంలో వాటిని భద్రంగా దాచుకో.
22 כִּֽי־ — חַיִּ֣ים — הֵ֭ם — לְמֹצְאֵיהֶ֑ם — וּֽלְכָל־ — בְּשָׂר֥וֹ — מַרְפֵּֽא׃ —
అవి దొరికిన వారికి జీవం కలుగుతుంది. వాళ్ళ శరీరమంతటికీ ఆరోగ్యం కలిగిస్తాయి.
23 מִֽכָּל־ — מִ֭שְׁמָר — נְצֹ֣ר — לִבֶּ֑ךָ — כִּֽי־ — מִ֝מֶּ֗נּוּ — תּוֹצְא֥וֹת — חַיִּֽים׃ —
అన్నిటికంటే ముఖ్యంగా వాటిని నీ హృదయంలో భద్రంగా కాపాడుకో. అప్పుడు నీ హృదయంలో నుండి జీవధారలు ప్రవహిస్తాయి.
24 הָסֵ֣ר — מִ֭מְּךָ — עִקְּשׁ֣וּת — פֶּ֑ה — וּלְז֥וּת — שְׂ֝פָתַ֗יִם — הַרְחֵ֥ק — מִמֶּֽךָּ׃ —
నీ నోటి నుండి కుటిలమైన మాటలు, మోసకరమైన మాటలు రానియ్యకు.
25 עֵ֭ינֶיךָ — לְנֹ֣כַח — יַבִּ֑יטוּ — וְ֝עַפְעַפֶּ֗יךָ — יַיְשִׁ֥רוּ — נֶגְדֶּֽךָ׃ —
నీ కంటిచూపు సూటిగా ఉండనియ్యి. నీ ఆలోచనల్లో ముందు చూపు కలిగి ఉండు.
26 פַּ֭לֵּס — מַעְגַּ֣ל — רַגְלֶ֑ךָ — וְֽכָל־ — דְּרָכֶ֥יךָ — יִכֹּֽנוּ׃ —
నువ్వు నడిచే మార్గం సరళం చెయ్యి. అప్పుడు నీ దారులన్నీ స్థిరపడతాయి.
27 אַֽל־ — תֵּט־ — יָמִ֥ין — וּשְׂמֹ֑אול — הָסֵ֖ר — רַגְלְךָ֣ — מֵרָֽע׃ —
కుడివైపుకు గానీ, ఎడమవైపుకు గానీ తొలగిపోవద్దు. దుర్మార్గం వైపు నడవకుండా నీ అడుగులు తప్పించుకో.”