Direction:
| Gloss Type:
| Reference:
| IPA: PDFs 1 దావీదు రాసిన యాత్రల కీర్తన యెహోవా, నా హృదయంలో అహంకారం లేదు. నా కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించడం లేదు. నాకు మించిన విషయాల జోలికి నేను వెళ్ళడం లేదు.
2 తల్లిపాలు విడిచిన పిల్ల తన తల్లి దగ్గర నిశ్చింతగా ఉన్నట్టు నేను ప్రశాంతంగా ఉండి నాప్రాణాన్ని స్థిమితంగా ఉంచుకున్నాను.
3 ఇశ్రాయేలు ప్రజలారా, ఇప్పటి నుండి ఎప్పటికీ యెహోవా పైనే ఆశ పెట్టుకోండి.