Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Telugu IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Gujarati IRV (2019) Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 וַיֹּ֤אמֶר — יְהוָה֙ — אֶל־ — מֹשֶׁ֔ה — עַתָּ֣ה — תִרְאֶ֔ה — אֲשֶׁ֥ר — אֶֽעֱשֶׂ֖ה — לְפַרְעֹ֑ה — כִּ֣י — בְיָ֤ד — חֲזָקָה֙ — יְשַׁלְּחֵ֔ם — וּבְיָ֣ד — חֲזָקָ֔ה — יְגָרְשֵׁ֖ם — מֵאַרְצֽוֹ׃ — ס —
అందుకు యెహోవా “ఫరోకు నేను చేయబోతున్నదంతా నువ్వు తప్పకుండా చూస్తావు. నా బలిష్ఠమైన హస్తం వల్ల అతడు వారిని బయటకు పంపించేలా చేస్తాను. నా హస్త బలం వల్లనే అతడు తన దేశం నుండి ప్రజలను వెళ్ళగొడతాడు.”
2 וַיְדַבֵּ֥ר — אֱלֹהִ֖ים — אֶל־ — מֹשֶׁ֑ה — וַיֹּ֥אמֶר — אֵלָ֖יו — אֲנִ֥י — יְהוָֽה׃ —
ఆయన ఇంకా మోషేతో ఇలా అన్నాడు “నేనే యెహోవాను.
3 וָאֵרָ֗א — אֶל־ — אַבְרָהָ֛ם — אֶל־ — יִצְחָ֥ק — וְאֶֽל־ — יַעֲקֹ֖ב — בְּאֵ֣ל — שַׁדָּ֑י — וּשְׁמִ֣י — יְהוָ֔ה — לֹ֥א — נוֹדַ֖עְתִּי — לָהֶֽם׃ —
నేను ‘సర్వశక్తి గల దేవుడు’ అనే పేరుతో అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమయ్యాను. కాని, యెహోవా అనే నా పేరు నేను వారికి తెలియబరచలేదు.
4 וְגַ֨ם — הֲקִמֹ֤תִי — אֶת־ — בְּרִיתִי֙ — אִתָּ֔ם — לָתֵ֥ת — לָהֶ֖ם — אֶת־ — אֶ֣רֶץ — כְּנָ֑עַן — אֵ֛ת — אֶ֥רֶץ — מְגֻרֵיהֶ֖ם — אֲשֶׁר־ — גָּ֥רוּ — בָֽהּ׃ —
వాళ్ళు పరాయి వారుగా నివాసం చేసిన కనాను దేశాన్ని వారికి ఇస్తానని నేను ఒప్పందం చేశాను.
5 וְגַ֣ם ׀ — אֲנִ֣י — שָׁמַ֗עְתִּי — אֶֽת־ — נַאֲקַת֙ — בְּנֵ֣י — יִשְׂרָאֵ֔ל — אֲשֶׁ֥ר — מִצְרַ֖יִם — מַעֲבִדִ֣ים — אֹתָ֑ם — וָאֶזְכֹּ֖ר — אֶת־ — בְּרִיתִֽי׃ —
ఐగుప్తీయులకు బానిసలుగా మారిన ఇశ్రాయేలు ప్రజల నిట్టూర్పులు విని నా నిబంధనను గుర్తు చేసుకున్నాను.
6 לָכֵ֞ן — אֱמֹ֥ר — לִבְנֵֽי־ — יִשְׂרָאֵ֘ל — אֲנִ֣י — יְהוָה֒ — וְהוֹצֵאתִ֣י — אֶתְכֶ֗ם — מִתַּ֙חַת֙ — סִבְלֹ֣ת — מִצְרַ֔יִם — וְהִצַּלְתִּ֥י — אֶתְכֶ֖ם — מֵעֲבֹדָתָ֑ם — וְגָאַלְתִּ֤י — אֶתְכֶם֙ — בִּזְר֣וֹעַ — נְטוּיָ֔ה — וּבִשְׁפָטִ֖ים — גְּדֹלִֽים׃ —
కాబట్టి నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు. నేనే యెహోవాను. ఐగుప్తీయుల బానిసత్వం కింద ఉన్న మీ కష్టాల నుండి మిమ్మల్ని విడిపిస్తాను. మిమ్మల్ని ఆ దేశం నుండి బయటకు రప్పిస్తాను. వాళ్లకు గొప్ప తీర్పు క్రియలు చూపి, నా చేతులు చాపి వారి బానిసత్వం కింద ఉన్న మిమ్మల్ని విడిపిస్తాను.
7 וְלָקַחְתִּ֨י — אֶתְכֶ֥ם — לִי֙ — לְעָ֔ם — וְהָיִ֥יתִי — לָכֶ֖ם — לֵֽאלֹהִ֑ים — וִֽידַעְתֶּ֗ם — כִּ֣י — אֲנִ֤י — יְהוָה֙ — אֱלֹ֣הֵיכֶ֔ם — הַמּוֹצִ֣יא — אֶתְכֶ֔ם — מִתַּ֖חַת — סִבְל֥וֹת — מִצְרָֽיִם׃ —
మిమ్మల్ని నా సొంత ప్రజగా నా చెంత చేర్చుకుని మీకు దేవుడైన యెహోవాగా ఉంటాను. అప్పుడు ఐగుప్తీయుల బానిసత్వం కింద నుండి మిమ్మల్ని విడిపించి బయటకు రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.
8 וְהֵבֵאתִ֤י — אֶתְכֶם֙ — אֶל־ — הָאָ֔רֶץ — אֲשֶׁ֤ר — נָשָׂ֙אתִי֙ — אֶת־ — יָדִ֔י — לָתֵ֣ת — אֹתָ֔הּ — לְאַבְרָהָ֥ם — לְיִצְחָ֖ק — וּֽלְיַעֲקֹ֑ב — וְנָתַתִּ֨י — אֹתָ֥הּ — לָכֶ֛ם — מוֹרָשָׁ֖ה — אֲנִ֥י — יְהוָֽה׃ —
అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఇస్తానని నేను చెయ్యి ఎత్తి శపథం చేసిన దేశానికి మిమ్మల్ని రప్పిస్తాను. ఆ దేశాన్ని మీకు సొంతం చేస్తాను. నేను యెహోవాను.”
9 וַיְדַבֵּ֥ר — מֹשֶׁ֛ה — כֵּ֖ן — אֶל־ — בְּנֵ֣י — יִשְׂרָאֵ֑ל — וְלֹ֤א — שָֽׁמְעוּ֙ — אֶל־ — מֹשֶׁ֔ה — מִקֹּ֣צֶר — ר֔וּחַ — וּמֵעֲבֹדָ֖ה — קָשָֽׁה׃ — פ —
మోషే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పినదంతా చెప్పాడు. అయితే వాళ్ళు తమ నిరాశ నిస్పృహల వల్ల, కఠినమైన బానిసత్వంలో కూరుకు పోయి ఉండడం వల్ల మోషే మాటలు లక్ష్యపెట్ట లేదు.
10 וַיְדַבֵּ֥ר — יְהוָ֖ה — אֶל־ — מֹשֶׁ֥ה — לֵּאמֹֽר׃ —
యెహోవా మోషేతో “నువ్వు రాజు ఆస్థానం లోకి వెళ్లి,
11 בֹּ֣א — דַבֵּ֔ר — אֶל־ — פַּרְעֹ֖ה — מֶ֣לֶךְ — מִצְרָ֑יִם — וִֽישַׁלַּ֥ח — אֶת־ — בְּנֵֽי־ — יִשְׂרָאֵ֖ל — מֵאַרְצֽוֹ׃ —
ఐగుప్తు రాజు ఫరోతో ఇశ్రాయేలు ప్రజలను అతని దేశం నుండి బయటకు పంపించమని చెప్పు” అన్నాడు.
12 וַיְדַבֵּ֣ר — מֹשֶׁ֔ה — לִפְנֵ֥י — יְהוָ֖ה — לֵאמֹ֑ר — הֵ֤ן — בְּנֵֽי־ — יִשְׂרָאֵל֙ — לֹֽא־ — שָׁמְע֣וּ — אֵלַ֔י — וְאֵיךְ֙ — יִשְׁמָעֵ֣נִי — פַרְעֹ֔ה — וַאֲנִ֖י — עֲרַ֥ל — שְׂפָתָֽיִם׃ — פ —
అప్పుడు మోషే “ఇశ్రాయేలీయులు నా మాట వినకపోతే ఫరో ఎందుకు వింటాడు? నాకు వాక్చాతుర్యం లేదు” అని యెహోవా సముఖంలో చెప్పాడు.
13 וַיְדַבֵּ֣ר — יְהוָה֮ — אֶל־ — מֹשֶׁ֣ה — וְאֶֽל־ — אַהֲרֹן֒ — וַיְצַוֵּם֙ — אֶל־ — בְּנֵ֣י — יִשְׂרָאֵ֔ל — וְאֶל־ — פַּרְעֹ֖ה — מֶ֣לֶךְ — מִצְרָ֑יִם — לְהוֹצִ֥יא — אֶת־ — בְּנֵֽי־ — יִשְׂרָאֵ֖ל — מֵאֶ֥רֶץ — מִצְרָֽיִם׃ — ס —
అప్పుడు యెహోవా మోషే అహరోనులతో “ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకురావడానికి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి, ఫరో దగ్గరికి మీరు బయలుదేరి వెళ్ళాలి” అని ఆజ్ఞాపించాడు.
14 אֵ֖לֶּה — רָאשֵׁ֣י — בֵית־ — אֲבֹתָ֑ם — בְּנֵ֨י — רְאוּבֵ֜ן — בְּכֹ֣ר — יִשְׂרָאֵ֗ל — חֲנ֤וֹךְ — וּפַלּוּא֙ — חֶצְר֣וֹן — וְכַרְמִ֔י — אֵ֖לֶּה — מִשְׁפְּחֹ֥ת — רְאוּבֵֽן׃ —
వారి వంశాల మూలపురుషులు వీరు: ఇశ్రాయేలు మొదటి కొడుకైన రూబేను కొడుకులు, హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ. వీళ్ళు రూబేను కుటుంబాలు.
15 וּבְנֵ֣י — שִׁמְע֗וֹן — יְמוּאֵ֨ל — וְיָמִ֤ין — וְאֹ֙הַד֙ — וְיָכִ֣ין — וְצֹ֔חַר — וְשָׁא֖וּל — בֶּן־ — הַֽכְּנַעֲנִ֑ית — אֵ֖לֶּה — מִשְׁפְּחֹ֥ת — שִׁמְעֽוֹן׃ —
షిమ్యోను కొడుకులు యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనాను స్త్రీకి పుట్టిన షావూలు. వీళ్ళు షిమ్యోను కుటుంబాలు.
16 וְאֵ֨לֶּה — שְׁמ֤וֹת — בְּנֵֽי־ — לֵוִי֙ — לְתֹ֣לְדֹתָ֔ם — גֵּרְשׁ֕וֹן — וּקְהָ֖ת — וּמְרָרִ֑י — וּשְׁנֵי֙ — חַיֵּ֣י — לֵוִ֔י — שֶׁ֧בַע — וּשְׁלֹשִׁ֛ים — וּמְאַ֖ת — שָׁנָֽה׃ —
లేవి కొడుకులు వారి వారి వంశావళుల ప్రకారం గెర్షోను, కహాతు, మెరారి. లేవి 137 సంవత్సరాలు జీవించాడు.
17 בְּנֵ֥י — גֵרְשׁ֛וֹן — לִבְנִ֥י — וְשִׁמְעִ֖י — לְמִשְׁפְּחֹתָֽם׃ —
గెర్షోను కొడుకులు వారి వారి వంశాల ప్రకారం లిబ్నీ, షిమీ.
18 וּבְנֵ֣י — קְהָ֔ת — עַמְרָ֣ם — וְיִצְהָ֔ר — וְחֶבְר֖וֹן — וְעֻזִּיאֵ֑ל — וּשְׁנֵי֙ — חַיֵּ֣י — קְהָ֔ת — שָׁלֹ֧שׁ — וּשְׁלֹשִׁ֛ים — וּמְאַ֖ת — שָׁנָֽה׃ —
కహాతు కొడుకులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. కహాతు 133 సంవత్సరాలు జీవించాడు.
19 וּבְנֵ֥י — מְרָרִ֖י — מַחְלִ֣י — וּמוּשִׁ֑י — אֵ֛לֶּה — מִשְׁפְּחֹ֥ת — הַלֵּוִ֖י — לְתֹלְדֹתָֽם׃ —
మెరారి కొడుకులు మహలి, మూషి. వీళ్ళు తమ తమ వంశాల ప్రకారం లేవి కుటుంబాలు.
20 וַיִּקַּ֨ח — עַמְרָ֜ם — אֶת־ — יוֹכֶ֤בֶד — דֹּֽדָתוֹ֙ — ל֣וֹ — לְאִשָּׁ֔ה — וַתֵּ֣לֶד — ל֔וֹ — אֶֽת־ — אַהֲרֹ֖ן — וְאֶת־ — מֹשֶׁ֑ה — וּשְׁנֵי֙ — חַיֵּ֣י — עַמְרָ֔ם — שֶׁ֧בַע — וּשְׁלֹשִׁ֛ים — וּמְאַ֖ת — שָׁנָֽה׃ —
అమ్రాము తన తండ్రి సోదరి యోకెబెదును పెళ్లి చేసుకున్నాడు. వారికి అహరోను, మోషే పుట్టారు. అమ్రాము 137 సంవత్సరాలు జీవించాడు.
21 וּבְנֵ֖י — יִצְהָ֑ר — קֹ֥רַח — וָנֶ֖פֶג — וְזִכְרִֽי׃ —
ఇస్హారు కొడుకులు కోరహు, నెపెగు, జిఖ్రీ.
22 וּבְנֵ֖י — עֻזִּיאֵ֑ל — מִֽישָׁאֵ֥ל — וְאֶלְצָפָ֖ן — וְסִתְרִֽי׃ —
ఉజ్జీయేలు కొడుకులు మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రీ.
23 וַיִּקַּ֨ח — אַהֲרֹ֜ן — אֶת־ — אֱלִישֶׁ֧בַע — בַּת־ — עַמִּינָדָ֛ב — אֲח֥וֹת — נַחְשׁ֖וֹן — ל֣וֹ — לְאִשָּׁ֑ה — וַתֵּ֣לֶד — ל֗וֹ — אֶת־ — נָדָב֙ — וְאֶת־ — אֲבִיה֔וּא — אֶת־ — אֶלְעָזָ֖ר — וְאֶת־ — אִֽיתָמָֽר׃ —
అహరోను అమ్మీనాదాబు కూతురు, నయస్సోను సహోదరి అయిన ఎలీషెబను పెళ్లి చేసుకున్నాడు. వారికి నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టారు.
24 וּבְנֵ֣י — קֹ֔רַח — אַסִּ֥יר — וְאֶלְקָנָ֖ה — וַאֲבִיאָסָ֑ף — אֵ֖לֶּה — מִשְׁפְּחֹ֥ת — הַקָּרְחִֽי׃ —
కోరహు కొడుకులు అస్సీరు, ఎల్కానా, అబీయాసాపు. వీళ్ళు కోరహీయుల కుటుంబాలు.
25 וְאֶלְעָזָ֨ר — בֶּֽן־ — אַהֲרֹ֜ן — לָקַֽח־ — ל֨וֹ — מִבְּנ֤וֹת — פּֽוּטִיאֵל֙ — ל֣וֹ — לְאִשָּׁ֔ה — וַתֵּ֥לֶד — ל֖וֹ — אֶת־ — פִּֽינְחָ֑ס — אֵ֗לֶּה — רָאשֵׁ֛י — אֲב֥וֹת — הַלְוִיִּ֖ם — לְמִשְׁפְּחֹתָֽם׃ —
అహరోను కొడుకు ఎలియాజరు పూతీయేలు కూతుళ్ళలో ఒకామెను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఫీనెహాసు పుట్టాడు. వీళ్ళు తమ తమ కుటుంబాల ప్రకారం లేవీ వంశ నాయకులు.
26 ה֥וּא — אַהֲרֹ֖ן — וּמֹשֶׁ֑ה — אֲשֶׁ֨ר — אָמַ֤ר — יְהוָה֙ — לָהֶ֔ם — הוֹצִ֜יאוּ — אֶת־ — בְּנֵ֧י — יִשְׂרָאֵ֛ל — מֵאֶ֥רֶץ — מִצְרַ֖יִם — עַל־ — צִבְאֹתָֽם׃ —
ఇశ్రాయేలు ప్రజలను తమ వంశాల క్రమం ప్రకారం ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకురావాలని యెహోవా ఆజ్ఞాపించింది ఈ అహరోను మోషేలనే.
27 הֵ֗ם — הַֽמְדַבְּרִים֙ — אֶל־ — פַּרְעֹ֣ה — מֶֽלֶךְ־ — מִצְרַ֔יִם — לְהוֹצִ֥יא — אֶת־ — בְּנֵֽי־ — יִשְׂרָאֵ֖ל — מִמִּצְרָ֑יִם — ה֥וּא — מֹשֶׁ֖ה — וְאַהֲרֹֽן׃ —
ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బయటికి పంపించాలని ఐగుప్తు రాజు ఫరోతో మాట్లాడిన మోషే, అహరోనులు వీరే.
28 וַיְהִ֗י — בְּי֨וֹם — דִּבֶּ֧ר — יְהוָ֛ה — אֶל־ — מֹשֶׁ֖ה — בְּאֶ֥רֶץ — מִצְרָֽיִם׃ — פ —
ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడాడు.
29 וַיְדַבֵּ֧ר — יְהוָ֛ה — אֶל־ — מֹשֶׁ֥ה — לֵּאמֹ֖ר — אֲנִ֣י — יְהוָ֑ה — דַּבֵּ֗ר — אֶל־ — פַּרְעֹה֙ — מֶ֣לֶךְ — מִצְרַ֔יִם — אֵ֛ת — כָּל־ — אֲשֶׁ֥ר — אֲנִ֖י — דֹּבֵ֥ר — אֵלֶֽיךָ׃ —
“నేను యెహోవాను. యెహోవా నీతో చెప్పినది మొత్తం నువ్వు ఐగుప్తు రాజు ఫరోతో చెప్పు.”
30 וַיֹּ֥אמֶר — מֹשֶׁ֖ה — לִפְנֵ֣י — יְהוָ֑ה — הֵ֤ן — אֲנִי֙ — עֲרַ֣ל — שְׂפָתַ֔יִם — וְאֵ֕יךְ — יִשְׁמַ֥ע — אֵלַ֖י — פַּרְעֹֽה׃ — פ —
అందుకు మోషే “నాకు వాక్చాతుర్యం లేదు. నా మాట ఫరో ఎలా వింటాడు?” అని యెహోవా సముఖంలో అన్నాడు.